సోమాలియాలో పేలిన ఉగ్రపంజా

Somalia Blast
Somalia Bomb Blast

మొగాదిషు: సోమాలియలో ఉగ్రవాదులు జరిపిన భారీ పేలుళ్లలో 50 మంది మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
రాజధాని మొగాదిషులో ఓ హోటల్‌ లక్ష్యంగా ముష్కరులు ట్రక్‌ బాంబుతో దాడికి పాల్పడ్డారు. తర్వాత కాల్పులు జరిపారు.
శనివారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరిగిన ఘటనా ప్రదేశం అంతా భీభత్సంగా మారింది. పేలుడు ధాటికి చాలా దూరంలో
ఉన్న భవనం కిటికీ అద్దాలు పగిలిపోగా, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం
అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, చిద్రమైన మృతదేహాలను తరలించారు. సోమాలియాకు
చెందిన అల్‌షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో
స్థానిక సఫారీ హోటల్‌ పూర్తిగా కూలిపోయింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు మీడియా వర్గాలు
వెల్లడించాయి.