సోమశిల ప్రాజెక్టుకు లైన్ క్లియర్

somasila project, Nellore, Andhra Pradesh
somasila project, Nellore, Andhra Pradesh

న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతులను కేంద్రం మంజూరు చేసింది.1016 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి ఎఫ్‌ఏసీ కమిటీ అనుమతిచ్చింది. 12 ఏళ్ల తర్వాత సోమశిల ప్రాజెక్టు అనుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పరుగులు పెట్టనున్నాయి. 1971లో ఈ ప్రాజెక్టును ఏపీలోని నెల్లూరు జిల్లా సోమశిల వద్ద పెన్నా నదిపై నిర్మించారు.