సోనియాగాంధీ క‌నిపించ‌డం లేదంటూ రాయ్‌బ‌రేలీలో వాల్‌పోస్ట‌ర్లు

sonia gandhi
sonia gandhi

రాయ్ బరేలిః  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయ్ బరేలి ఎంపీ సోనియా గాంధీపై ఆమె సొంత నియోజకవర్గ ప్రజలు
అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టనష్టాలు, సమస్యలు చెప్పుకుందామంటే తమ నేత కనిపించడం
లేదంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ కనిపించడం లేదంటూ నియోజకవర్గ వ్యాప్తంగా
వాల్ పోస్టర్లు, ప్రకటనలు అంటించారు. సోనియా ఆచూకీ చెప్పిన వారికి బహుమతులిస్తామంటూ ప్రకటించడం
విశేషం.