సొరకాయ, గుమ్మడి బొబ్బట్లు

                       సొరకాయ, గుమ్మడి బొబ్బట్లు

RUCHI
RUCHI

కావలసినవి: సొరకాయ తురుము-కప్పు పంచదార-కప్పు పేనీరవ్వ-అరకప్పు యాలకులపొడి- అరచెంచా శొంఠిపొడి-కొద్దిగా నెయ్యి-కప్పు
తయారుచేసే విధానం: సొరకాయ తురుమును గట్టిగా పిండితే, నీరంతా పోతుంది. పేనీరవ్వను ముందుగానే కలిపి గంటసేపు నాననివ్వాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి, రెండు చెంచాల నెయ్యి వేసి సొరకాయ తురుమును వేయించాలి. పచ్చివాసనపోయాక పంచదార కలపాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక యాలకులపొడి, శొంఠిపొడి చేర్చి దింపేయాలి. ముందుగా నానబెట్టిన పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న పూరీల్లా వత్తుకోవాలి. ఒక్కో పూరీలో హల్వాను కొద్దిగా ఉంచి, చుట్టూ మూసేసి మళ్లీ వత్తాలి. ఇలా చేసుకున్న వాటిని నెయ్యితో కాల్చితే సరిపోతుంది. కమ్మని వాసనతో నోరూరించే బొబ్బట్లు సిద్ధం. పేనీ రవ్వ దొరకని పక్షంలో బొంబాయిరవ్వను మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు.
గుమ్మడికాయతో…
కావలసినవి: గుమ్మడికాయ తురుము-మూడు కప్పులు బెల్లం తురుము-ఒకటిన్నరకప్పులు మైదా-ముప్పావ్ఞ కప్పు యాలకులపొడి-ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి-తగినంత
తయారుచేసే విధానం: స్టవ్‌మీద కళాయి పెట్టి అందులో తురిమిన గుమ్మడికాయను వేసి కొద్దిగా నెయ్యి వేసి పదినిమిషాలు వేయించాలి. ఆ తరువాత అందులో తురిమిన బెల్లం వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసి దించేయాలి. చల్లారాక చిన్న ఉండలుగా చేసుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిని పదినిమిషాలు మూతపెట్టి గిన్నె లో ఉంచాలి. ఆ తరువాత చపాతీలా చేసి అందులో ఈ గుమ్మడికాయ ముద్దను పెట్టి చేత్తోకాని, కర్రతో కాని వత్తాలి. ఇపుడు పెనం మీద వీటిని వేస్తూ నెయ్యితో కాని నూనెతో కాల్చుకోవాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.