సొంత ఖ‌ర్చుతో రీసెర్చ్ చేసి రాసుకున్న‌వేః ఐల‌య్య‌

kanche iahlaiah
kanche iahlaiah

హైద‌రాబాద్ః తాను రాసిన పుస్తకాలన్నీ సొంత ఖర్చుతో రీసెర్చ్ చేసి రాసుకున్నవేనని, ఏ క్రిస్టియన్ సంస్థ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని.. తనకు ఆ అవసరం కూడా లేదని కంచె ఐలయ్య అన్నారు. తనకు మంచి జీతం వస్తోందని, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుందని చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బిషప్స్ తో కూడా నాకు కొట్లాట ఉంది. స్వామీజీలతోనూ నాకు కొట్లాట ఉంది’ అని అన్నారు. ‘అందరితో కొట్లాట పెట్టుకుని ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు ఐలయ్య స్పందిస్తూ, ‘కొట్లాట పెట్టుకుని ఆఖరికి మట్టిలో కలుస్తా. నేను రాసిన పెన్నును పదివేల సంవత్సరాల పాటు కౌటిల్యుడికి అడ్డంగా నిలబెట్టి పోవాలని చూస్తున్నా. కౌటిల్యుని భరతం పట్టడమే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.