‘సైరా’ అత్యద్భుతం అదే..

Chiranjeevi shoots
Sye Raa Chiranjeevi shoots

‘సైరా’ అత్యద్భుతం అదే..

టాలీవుడ్‌ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ మెగాస్టార్‌ ‘సైరా.. ప్రస్తుతం ఈసినిమాలోని అత్యద్భుతమైన దృశ్యం తెరకెక్కుతోది.. హిస్టారికల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తోంది ఫిల్మ్‌ టీం.. ఈసినిమాలో మోస్ట్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తున్న అమితాబ్‌, స్వయంగా ఈ స్టిల్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్‌లో మెగాస్టార్‌ అదిరిపోయాడు.. పెళ్లికూతురు నయనతార ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌లో ఒందికగా ఒదిగిపోయిదనిపిస్తోంది. సినిమాలో హైఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయనున్న ఈ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ నిర్మించారు. అల్టిమేట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అమితాబ్‌ చిరంజీవికి గురువుగా నటిస్తున్నారు.