సైమాంటిక్‌తో ఎయిర్‌టెల్‌ ఒప్పందం

AIRTEL
AIRTEL

సైమాంటిక్‌తో ఎయిర్‌టెల్‌ ఒప్పందం

ముంబయి, ఆగస్టు 29: ప్రపంచ వ్యాప్త సైబర్‌ సెక్యూ రిటీ సంస్థ సైమాంటిక్‌తో టెలికాం కంపెనీ ఎయిర్‌టైల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. సంస్థకు కావాల్సిన సైబర్‌ సెక్యూరిటీ సేవలందించేందుకుగాను ఈ ఒప్పందం కుదుర్చినట్లు ఎయిర్‌ టెల్‌ వెల్లడించింది. డిజిటలైజే షన్‌కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో సైబర్‌ నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వీటికి చెక్‌ చెప్పేందుకే సైమాంటిక్‌ కార్పొరేషన్‌తో డీల్‌ చేసు కున్నామని ఎయిర్‌టెల్‌ చెపుతోంది. ఎన్‌ఎస్‌ఇలో ఈ స్టాక్‌ 0.4శాతం మేర పెరిగి రూ.434.40వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్‌జియోతో గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌ జియోకు ధీటుగా ఇటీవలే తాను కూడా ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేస్తున్నట్లు ప్రకటించింది. జియో తో సమానంగా టారిఫ్‌లు కూడా ఇస్తున్నట్లు కస్టమర్లను రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. పేమెంట్‌ వ్యవస్థ బలంగా ఉన్న ఎయిర్‌టెల్‌కు డిజిటల్‌ లావాదేవీల్లో భారీ స్థాయిలో కస్టమర్లకు సెక్యూరిటీ పెంచేందుకు వీలుగా ఈ సైమాంటిక్‌తో ఒప్పందం చేసుకుంది.