సైబర్‌ భద్రతపై అవేర్‌నెస్‌ అవసరం

Cyber Security
Cyber Security

హైదరాబాద్‌: హైటెక్‌సిటిలో హెచ్‌ఐసిసిలో సైబర్‌ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ‘సొసైటి ఫర్‌ సైబర్‌
సెక్యూరిటీ కౌన్సిల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటైన సదుస్సులో సైబర్‌ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇజ్రాయెల్‌పై అమెరికాకు చెందిన నిపుణులు సూచనలు చేశారు. సైబరాబాద్‌, రాచకొండ
పరిధిలో ఉన్న ఐటి సంస్థల భద్రతతో పాటు శాంతి భద్రతలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ సివి ఆనంద్‌, సైబరాబాద్‌ కమీషనర్‌లు సందీప్‌ శాండిల్యా,
మహేశ్‌ భగవత్‌ ఈ సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.