సైనిక చర్యకు తమ సైన్యం సిద్ధంగా ఉంది: ట్రంప్‌

trump
trump

వాషింగ్టన్‌: ఈ మధ్య కాలంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నిరంతరం వార్తలో నిలుస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు
ట్రంప్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ వున్‌ ఏ మాత్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నా
తాము సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని, దేశం జోలికి వస్తే ఉరుకునేది లేదని ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా కిమ్‌ జోంగ్‌ వున్‌
తన పద్దతిని మార్చుకుంటారని అశిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించుకోవాలని
చైనా ఇరు దేశాలకు సూచిస్తుంది.