సైనిక్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు ఎస్‌బిఐ 14.04 లక్షల విరాళం

SBI
SBI

హైదరాబాద్‌: సైనిక్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు ఎస్‌బిఐ తెలంగాణ సర్కిల్‌ యాజమాన్య కమిటీ 14 లక్షల నాలు గు వేల 350 రూపాయల చెక్కును విరాళంగా అందజేసింది. ఎస్‌బిఐ తరపున ఈ చెక్కును సిజిఎం స్వామినాథన్‌ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్‌బిఐ అధికారులు మయ్యా, ర మేష్‌, బంగార్రాజు, హనుమంతరావుతో పాటు సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు డైరక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.