సైనికులను స్మార్ట్‌ఫోన్లు వినియోగించకుండా అపలేం

smart phone
smart phone

న్యూఢిల్లీ: జవాన్లను స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌మీడియాలను వినియోగించకుండా నియంత్రించలేమని సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. సైనికులను ట్రాప్‌ చేసి వారి నుండి దేశ రహస్యాలను పొందేందుకు శత్రవులు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే ఆ కారణంగా సైనికులను సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటివల వార్తలు వచ్చాయి. అలా నియంత్రంచడం అసాధ్యమని ఆర్మీచీప్‌ అన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాలాముఖ్యమన్ని, దానికి సోషల్‌మీడియా అవసరమని రావత్‌ అన్నారు. అయితే ఈ విషయంలో వారికి క్రమశిక్షణ తెలియజేయడం ముఖ్యం అని అన్నారు.