సైనా నెహ్వాల్‌ సంచలనం

Saina Nehwal
Saina Nehwal
జకర్తా: భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళుతోంది. సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌లో ఆరోసీడ్‌ హే బిన్‌గ్జియావో (చైనా)తో తలపడిన సైనా ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను బిన్‌గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకుంది.ఆ తర్వాతి సెట్‌లలో సైనా జోరు కొనసాగించింది. రెండు, మూడో సెట్‌లను 21-12, 21-18 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా చైనా షెట్లర్ చెన్ యూఫే, స్పెయిన్‌ షట్లర్ కరోలినా మారిన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో గెలిచిన విజేతతో సైనా ఫైనల్స్‌లో తలపడనుంది.