సేమియా కట్‌లెట్‌

hqdefault
hqdefault

సేమియా కట్‌లెట్‌

కావలసినవి
సేమియా-100గ్రా, బంగాళాదుంపలు-3 గరంమసాలా-అరచెంచా, కొత్తిమీర-అరకట్ట పచ్చిమిర్చి-నాలుగు ఉల్లిపాయలు-రెండు (సన్నగా తరగాలి) గుడ్లు-రెండు, ఉప్పు-తగినంత నూనె-వేయించడానికి సరిపడా, బ్రెడ్‌పొడి-అరకప్పు

తయారుచేసే విధానం
ముందుగా సేమియాను బంగాళాదుంపలను విడివిడిగా ఉడికించుకోవాలి. చల్లారాక బంగాళాదుంపను మెత్తగా చేయాలి. గుడ్ల సొనను గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పెనంలో నూనెవేసి దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర వేసి గోధుమవర్ణంలోకి వచ్చేవరకూ వేయించి, గరంమసాలా, ఉప్పు చేర్చి దానికి సేమియా, బంగాళాదుంప ముద్దను కలిపి పొయ్యి కట్టేయాలి. సేమియా మిశ్రమాన్ని చిన్న వడ మాదిరి చేసి గుడ్డుసొనలో ముంచి బ్రెడ్‌పొడిలో అద్ది పెనం మీద నూనెతో కాల్చి గోధుమవర్ణం లోకి వచ్చాక తీస్తే సరిపోతుంది. ఈ వేడివేడి సేమియా కట్‌లెట్‌ను టమాటా సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.