సెల‌వు తీసుకున్న స్టీఫెన్ హాకింగ్‌

stephen hawking
stephen hawking

లండ‌న్ః ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కదలడానికి సహకరించని శరీరంతో చక్రాల కుర్చాకి అతుక్కు పోయి, కనీసం మాట్లాడటానికీ అవకాశం లేని స్థితిలో ఆయన కంప్యూటర్ సాయంతో ఖగోళ పరిశోధనలు సాగించారు. కృష్ణ బిలాలపై ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్‌కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా… మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి… కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు.