సెల్‌ఫోన్‌ టార్చిలైటు నీడన శస్త్రచికిత్స

OPERATION WITH CELLPHONE TORCH-1

This slideshow requires JavaScript.

సెల్‌ఫోన్‌ టార్చిలైటు నీడన శస్త్రచికిత్స

జిజిహెచ్‌ వైద్యుల పట్ల ఆగహావేశాలు –
-ఆసుపత్రి వద్ద ఆందోళన

గుంటూరు : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులపట్ల సూపరిన్‌టెన్‌డెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు నిర్లక్ష వైఖరితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో సూపరిన్‌టెన్‌డెంట్‌ గో బ్యాక్‌ అంటూ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు.ప్రభుత్వాసుపత్రిల్లో బుధవారం సెల్‌ఫోన్‌ టార్చిలైటు నీడన ఓ రోగికి వైద్యులు ఆపరేషన్‌ చేయాల్సిన దుర్గతిని సూపరిన్‌డెన్‌టెండ్‌ కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు.

గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా తన అనుయాయులతో జిజిహెచ్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి దాతలు,ఎన్నారైలు,ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు సమకూరుస్తున్నా వాటిని సక్రమంగా వినియోగించడంలో సూపరిన్‌డెన్‌టెండ్‌ వైఫల్యం చెందారన్నారు.తన పదవీకాలం పూర్తయినప్పటికి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని చివరి నిమిషంలో తన పదవీ కాలాన్ని మరో మూడేళ్ళు పొడిగించుకునే జీఓను తెప్పించుకున్న ఘనుడన్నారు.

చుట్టుపక్కల జిల్లాల పేదప్రజల ఆరోగ్య ప్రదాయినిగా నిలిచి 70ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన ప్రభుత్వాసుపత్రి కీర్తిని అభాసుపాలు చేస్తున్నారన్నారు.ఆసుపత్రిలో జనరేటర్‌ఉన్నప్పటికి కరెంటు పోయినపుడు అది తక్షణమేపనిచేసే వ్యవస్థ లేదన్నారు.రూ.2లక్షలతో ఆసుపత్రి మొత్తం విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయచ్చని కనీసం ఆ పరిస్థితులు ఇక్కడ లేకపోవడం బాధిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు కావస్తున్నా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు.

ఆసుపత్రి అభివృద్ధి సంఘ సభ్యునిగా గతంలో స్థానిక శాసనసభ్యునికి అవకాశం ఉండేదని నేటి ప్రభుత్వం అభివృద్ధి కమిటీల్లో తనకు స్థానం కల్పించకుండా రాజకీయ కుట్ర చేసిందన్నారు.పేద రోగుల పట్ల ప్రభుత్వానికున్న చిన్నచూపు విడనాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రిలో భవనాలు నెర్లిచ్చి కరెంటు వైర్లు బయటకు వేలాడుతున్నాయని ఇది ప్రమాద బరితంగా ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రి అభివృద్ధికి తన సొంత ఖర్చు వెచ్చించి 40మంది సిబ్బందిని నియమించి ఆసుపత్రి మొత్తం పచ్చని వాతావరణం ఉండేట్లుగా మొక్కలు నాటించారన్నారు.కాని వాటి సంరక్షణ చేయాల్సిన అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించారన్నారు.రోగుల ప్రాణాలతో చెలగాటాలు ఆడవద్దని ఉన్నతాధికారులను కోరారు.ప్రభుత్వ వైఖరి మారకుంటే రానున్న కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.ఇదే పరిస్థితి కొనసాగితే తాను ఆసుపత్రి బయట ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగటతానన్నారు.సూపరిన్‌డెన్‌టెండ్‌ డాక్టర్‌ రాజునాయుడును భర్తరఫ్‌ చేయాలని ముస్తఫా అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు మహ్మద్‌,సత్యనారాయణ,కిషోర్‌,ఈర్రీ సాయి,ఐలా శ్రీను,షరీఫ్‌,అంబటి నాగరాజు,రమణయ్య,మురళీ తదితరులు పాల్గొన్నారు.