సెమీస్‌కు దూసుకెళ్లిన యువ భారత్‌

JUNIOR CRICKETERS1
JUNIOR CRICKETERS1

సెమీస్‌కు దూసుకెళ్లిన యువ భారత్‌

న్యూజిలాండ్‌: ఐసిసి అండర్‌ 19 ప్రపంచ కప్‌లో భారత్‌ సెమీఫైనల్‌కు ఎదురులేకుండా దూసుకెళ్లింది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లనూ గెలిచిన భారత్‌… శుక్రవారం భారత జట్టు టోర్నీ లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెమీస్‌లో తలపడేందుకు సన్నద్ధమైెంది. తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ పృథ్వీ షా(40), శుభ్నమ్‌ గిల్‌ 86), అభిషేక్‌ శర్మ (50) బ్యాటిం గ్‌లో రాణించడంతో భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

ఐదు గురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయ లేకపోవడం గమనార్హం.బంగ్లా బౌలర్లు క్వాజి ఒనిక్‌ 3, నయీమ్‌ హీసన్‌ 2, సైఫ్‌ హాసన్‌ 2 వికెట్లు తీశారు.వీరి ధాటికి భారత్‌ 49.2 పరుగులకు ఆలౌటై 265 పరుగులు చేసింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మొదటి నుంచి తడబడుతూనే ఉంది.

23పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్‌…ఇక తేరుకోలేకపోయింది. వరుసపెట్టి వికెట్లను కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ టెస్టు మ్యాచ్‌ను తలపించారు. భారత బౌలర్లు నాగర్‌ కోటి 3వికెట్లు, శివమ్‌ మావి ,అభిషేక్‌ వర్మ చెరో రెండు వికెట్లు తీసి రాణించడంతో ఆ జట్టు 42.1 ఓవర్లలో 134 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్‌ 131 పరుగుల తేడాతో విజయం సాదించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.శుభ్నమ్‌ గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈనెల 30న జరగనున్న సెమీఫైనల్‌-2లో భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. ఈనెల 29న జరగనున్న సెమీఫైనల్‌-1లో ఆస్ట్రేలియా – అప్గానిస్తాన్‌ మధ్య విజేత ఎవరో తేలనుంది.