సెప్టెంబర్‌లో రికార్డు సృష్టించిన వాహన విక్రయాలు!

vehicles
vehicles

హైదరాబాద్‌: గతనెలలో వాహన విక్రయాలు రికార్డు సృష్టించాయి. కేవలం దసరా పండుగ సందర్బంగానే రాష్ట్రంలో 1.50 లక్షల కార్లు, ఇతర వాహనాలను కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే దేశీయ ప్రయాణీకుల వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో 11.32 శాతం పెరిగి 3,09,955  యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదేనెలలో 2,78,428 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌  ఆటోమోబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌్‌ (ఎన్‌ఐఏఏఎం) విడుదల చేసిన గణాంకాలు ఈవిషయాన్ని వెల్లడించాయి.  గత ఏడాది సెప్టెంబర్‌లో 1,95,259 కార్లు అమ్ముడుపోగా ఈసారి 6.86 శాతం పెరిగి 2,08,656కు చేరుకున్నాయి. అలాగే దిచక్ర వాహనాలు
12,69,612 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం ఇదేనెలలో 11,86,759 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే గతేడాది పోలిస్తే విక్రయాలు 6.98 శాతం పెరిగాయి. అలాగే వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా సెప్టెంబర్‌లో 25.77 శాతం పెరిగినట్లు ఎన్‌ఐఎఎం తెలిపింది.