సెన్సార్‌ పూర్తిచేసుకున్న ‘ఇగో’

Ego
Ego

ఆకతాయి ఫేం ఆశిష్‌రాజ్‌, సిమ్రాన్‌ జంటగా రూపొందుతున్న సినిమా ఇదో.. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో విజయ కరణ్‌, కౌసల్‌ కరణ్‌, అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి సాయికార్తీక్‌ సంగీతం అందించారు. ఈచిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యుబై ఎ సర్టిఫికెట్‌ అందించారు. ఇగో చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయటానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ, హిలేరియస్‌ అండ్‌ ఎమోషనల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ఇగో అన్నారు. నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈచిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడ నచ్చేలా సినిమా ఉంటుందన్నారు. ఆశీష్‌ రాజ్‌ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్‌, దీక్ష పంత్‌ల పాత్రలు చిత్రానిక ఇప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయన్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. అలాగే సాయి కార్తీక్‌ సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాకు హెల్ప్‌ అవుతుందన్నారు.