సెన్సార్‌ కంప్లీట్‌

venki, varun tej
venki, varun tej

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కలయికలో దర్శకుడుఅనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం వినయ విధేయ రామ… ఈచిత్రం సెన్సార్‌కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.. యుబైఎ సర్టిఫికెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమైంది.. ఇక అనిల్‌ రావిపూడి ఈచిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించారని తెలిసింది.. ఈచిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా. వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్‌ కౌర్‌ నటిస్తున్నారు. ఓ కీలకపాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కన్పించనున్నారు.. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.. ఇక ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.