సూర్య వచ్చేస్తున్నాడు!

SURYA111
Suryan Shrutihassan in Singam3

సూర్య వచ్చేస్తున్నాడు!

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు. తమిళంలో స్టూడియోగ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌రాజా, తెలుగులో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ఈ నెల 16న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేశాయి. అయితే తాజాగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. హరీస్‌ జైరాజ్‌ స్వరాలను సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలవబోతుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్‌ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. డిసెంబర్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.