సూర్య కోసం ఏడు విమానాలు!

SURYA22
Surya

సూర్య కోసం ఏడు విమానాలు!

పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ సూర్య. హరి దర్శకత్వంలో పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన నటించిన సింగం, సింగం-2 సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న సింగం-3పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు, తమిళ భాషల్లో హై బడ్జెట్‌తో ఎక్కడా తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ కోసం చిత్రయూనిట్‌ ఏకంగా ఏడు విమానాలు బాడుగకు తీసుకుందట. చాలా సన్నివేశాలను విమానంలో వెళుతూనే చిత్రీకరించారట. క్లైమాక్స్‌లో లారీ ఛేజింగ్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట. మరి ఆ ప్రత్యేకతలన్నీ తెరమీదే చూడాలంటోంది చిత్ర యూనిట్‌. అనుష్క, శృతీహాసన్‌ హీరోయిన్లుగా నటించిన సింగం-3 డిసెంబర్‌ 16న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ విడుదలవుతోంది.