సూర్యాపేట‌లో ప‌ర్య‌టించ‌నున్న కెసిఆర్‌

CM KCR
CM KCR

హైద‌రాబాద్ః ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి సూర్యాపేట చేరుకుంటారు. గొల్లబజార్‌లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తారు. కుడకుడ శివారులో నిర్మించబోయే సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేస్తారు. 3 గంగలకు చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహడ్‌లో 400 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. తర్వాత మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేటలో గొట్ల బజార్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటలకు సూర్యాపేట జూనియర్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.