సూప‌ర్ స్పెషాలిటీ సీట్ల భ‌ర్తీకి సుప్రీం సై

Super Speciality doctors
Super Speciality doctors

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో 48, దేశవ్యాప్తంగా 600 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీం కోర్టు అంగీకరించింది. సూపర్‌ స్పెషాలిటీ సీట్ల భర్తీపై తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు, కళాశాలలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీట్లు ఎలా భర్తీ చేయాలనే విషయాన్ని తీర్పులో స్పష్టం చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.