సూపర్‌స్టార్‌ సినిమాకు మోహనన్‌

KU MOHAN
KU MOHANAN

సూపర్‌స్టార్‌ సినిమాకు మోహనన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఓభారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఈచిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కెయు మోహనన్‌ పనిచేయనున్నారు. బాలీవుడ్‌లో 2006లో వచ్చిన డాన్‌ చిత్రానికి , తలాష్‌, రయీస్‌ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ను అందించిన ఆయన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న 25వ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.. మహేష్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీపైడిపల్లి, హరి , సాల్మన్‌..=