సుహాసిని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్: కూకట్‌పల్లి టిడిపిఅభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సుహాసినితో పాటు నందమూరి బాలకృష్ణ, చుండు శ్రీహరి, పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు నివాళలర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్‌, చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి ముందడుగు వేస్తున్నానన్నారు. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.