సుహాసినికి నా దీవెనలు ఉంటాయి

purandheswari
purandheswari

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని మేనత్త పురంధేశ్వరి ఆమెకు మద్దతిస్తారా? లేదా? అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పురంధేశ్వరి స్పందించారు. మేనత్తగా సుహాసినికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. పార్టీ పరంగా టిడిపితో తాను వ్యతిరేకించినా సుహాసినికి తన దీవెనలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.