సురేఖ గురు ద్రోహి : కోచ్

jyoti surekha
jyoti surekha

విజ‌య‌వాడః అంతర్జాతీయ ఆర్చర్‌ జ్యోతి సురేఖ నగదు బహుమానంపై శాప్‌ జారీ చేసిన జీవో వివాదం సద్దుమణిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోవివాదం తెరమీదికొచ్చింది. ఆర్చర్ జ్యోతిసురేఖ గురు ద్రోహం చేసిందంటూ చీఫ్‌ కోచ్‌ సత్యనారాయణ, ఆయన సతీమణి నిరసన దీక్ష చేపట్టారు.
గుణదలలో కుమారుడు లెనిన్‌ సమాధి వద్ద సత్యనారాయణ, వోల్గా ఆర్చరీ అకాడమీలో ఆయన భార్య దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సత్యనారాయణ.. జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పేవరకు దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. సత్యనారాయణకు క్రీడా సంఘాలు, క్రీడాకారులు మద్దతు పలికారు. అయితే ఈ వ్యవహారంపై జ్యోతి సురేఖ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.