సుప్రీం పదవీచ్యుతికి సంతకాల సేకరణ!

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాను తొలగించేందుకు ఆయనపై ప్రవేశపెడుతున్న అభిశంసన తీర్మానం ప్రతిపాదనకోసం కాంగ్రెస్‌ పార్టీ 65 మంది రాజ్యసభె ంపిల సంతకాలను సేకరించింది మరింతగా ఏకాభిప్రాయసాధనకోసం కృషిచేస్తోంది. కనీస సంఖ్యఎంపికల సంతకాలు అవసరమనుకున్న వాటికంటే 15 మంది ఎంపిలు అదనంగా సంతకాలుచేసినట్లు తేలింది. ఎన్‌సిపి, సమాజ్‌వాదిపార్టీ, బహుజన్‌సమాజ్‌పార్టీలుసైతం పదవీచ్యుతి ప్రతిపాదనకు సమ్మతించాయి. ఇప్పటికే అవసరమైన సంతకాలను సేకరించినా మరింతగా విశాలధృక్పథంతో ఏకాభిప్రాయసాధనకు కృషిచేస్తోంది. ప్రతిపక్ష శిబిరంలో ఇప్పటివరకూ 65 మందిసంతకాలుచేసారు. కనీస ప్రతిపాదన అర్హతకంటే 15 మంది సంతకాలు అదనంగా ఉన్నాయి. గతవారంలోనే తాము తమ సంతకాలను రెండుసెట్ల ఖాళీపేపర్లపై చేసి ఇచ్చామని, మొదటిసెట్‌ సిజెఐ తొలగింపుకోసమని, రెండోసెట్‌ ఎస్‌సిఎస్టీ చట్టం నిర్వీర్యంచేయడంపై సంతకాలుచేసినట్లు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపి దక్షిణాదినుంచి ఒకాయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారిక వైఖరి ఏమిటన్నది చర్చల్లోనే తేలాల్సి ఉంది. ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ప్రతిపక్ష నాయకులందరినీ ఏకంచేసేందుకు పదవీచ్యుతి తీర్మానానికి మద్దతిచ్చేందుకు కృషిచేస్తున్నారు. 50మందికిపైగా సంతకాలుచేసినా తమ పార్టీ అధ్యక్షుడు మరింతగా ప్రతిపక్ష ఏకాభిప్రాయం అవసరం అవుతుందని అన్నారు. తృణమూల్‌కాంగ్రెస్‌, డిఎంకె, బిజుజనతాదళ్‌ వంటివి ఇప్పటివరకూ ఈ అభిశంసన తీర్మానానికి దూరంగా ఉన్నాయి. అయితే మరిన్ని ప్రాంతీయ పార్టీలనుసైతం ఏకం చేసేందుకు కృషిజరుగుతున్నదని అన్నారు. సోమవారం వరకూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి నోటీసు ఇవ్వకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బిజెడి దీపక్‌మిశ్రాపై చర్యను వ్యతిరేకిస్తోంది. మిశ్రా ఒడిశాకు చెందిన వ్యక్తి కావడమే ఇందుకుకీలకం. తృణమూల్‌కాంగ్రెస్‌ తన వైఖరిని ఇప్పటికీ స్పష్టంచేయలేదు. మొట్టమొదటిసారిగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ఈప్రతిపాదన తెచ్చారు. టిఎంసి, సిపిఎం పార్టీలు ప్రధానప్రత్యర్ధులుగా ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లనే తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని టిఎంసి ఎంపిలు చెప్పారు. కోల్‌కత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌ తరహాలోనే రాజ్యసభనుంచి పదవీచ్యుతి చేసిన తరహాలోనే చేయాలని నిర్ణయించారు. అదే తరహా ప్రస్తుతం ఛీఫ్‌జస్టిస్‌ కేసులో ఏకాభిప్రాయం రాలేదు. పార్టీ నాయకత్వం చిట్టచివరికి అభిశంసనకు మద్దతివ్వాలనినిర్ణయించింది. ఎన్‌సిపి ఎంపి మజీద్‌మెమన్‌మాట్లాడుతూ అనేక ప్రతిపక్ష ఎంపిలు తనతోపాటు ఈ పిటిషన్‌పై సంతకాలుచేసారని సిజెను తొలగించాలనే నిర్ణయించారన్నారు. గత వారంలో సీనియర్‌ న్యాయవాది స్వరాజ్‌ అభియాన్‌పార్టీ అధినేత ప్రశాంత్‌ భూషణ్‌ పశ్చిమబెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు. టిఎంసి నాయకుడు ఒకరు ఈ సమావేశాన్ని ధృవీకరించారు.మిశ్రాకు వ్యతిరేకంగా అవిశ్వాసానికి టిఎంసికూడా కలిసిరావచ్చని చెపుతున్నారు. సీనియర్‌కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు ఈ సంతకాల సేకరణ జాబితాను మరింత సవరించాల్సి ఉందని అన్నారు. కొందరుసభ్యులు రిటైర్‌ అవుతున్నందున వారి సంతకాలను ఈ జాబితానుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.