సుప్రీం తీర్పుతో మరింత ఆదాయం: మాణిక్యాలరావు

Manikyala Rao
Manikyala Rao

విజయవాడ: దేవుని మాన్యాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హర్షం వ్యక్తం చేశారు. ఆ తీర్పు వలన ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా చోట్ల దేవుని భూములను కబ్జా చేసి అక్రమంగా ఆస్తులను సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి చెప్పినట్లు రూ.1300 కోట్లు ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో బిజెపి ‘గుండె గుండెకూ బిజెపి ‘ నినాదంతో ప్రజల్లోకి దూసుకుపోతుందని మాణిక్యాలరావు తెలిపారు.