సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉన్నాం!

Kerala cm Vijayan
Kerala cm Vijayan

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై   సుప్రీం తీర్పునకే తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మరోసారి స్పష్టం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని కాదని ఎవరూ  ఏమి చేయలేరు  అన్నారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు  వెల్లడించారు.    శబరిమలకు బస్సులో వెళ్తున్న మహిళా జర్నలిస్టులను నీలక్కళ్‌‌ వద్ద దింపేసిన సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. దేవాలయానికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామన్నారు.