సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇందూమల్హోత్రా

Indu
Indu Malhotra

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఓ మహిళ న్యాయవాది నేరుగా సుప్రీం ధర్మాసనానికి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మూడు నెలల క్రితం ఐదుగురు సభ్యులు గల కొలీజియం సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరును సుప్రీం ధర్మాసనం న్యాయమూర్తి స్థానానికి ప్రతిపాదించడంతో అక్కడి నుంచి న్యాయశాఖకు, ఆ తర్వాత ఇంటలిజెన్స్‌ బ్యురో(ఐబి) ఆమె వివరాలు చేరి, ఆఖరికి ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. ఇందూ మల్హోత్రాతో పాటు కొలిజియం, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోసెఫ్‌ పేరును కూడా సుప్రీం ధర్మాసనం పదవికి సూచించగా, ఆయన నియామకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.