సుప్రీంకోర్టు అంటే ఇంత నిర్లక్ష్యమా?

SUPREME COURT
SUPREME COURT

సుప్రీంకోర్టు అంటే ఇంత నిర్లక్ష్యమా?

ఆదాయపు పన్ను శాఖపై మండిపడిన సుప్రీం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే ఏమని అను కుంటున్నారు? ఏదో పిక్నిక్‌కు వచ్చినట్లు తేలిగ్గా తీసుకుంటారా? ఒకస్టేట్‌మెంట్‌ ఫైల్‌ చేయ టానికి 596రోజులా?.. పైగా తప్పులు తడకలతో ఫైల్‌ చేసారు.. ఇంత నిర్లక్ష్యమా? అంటూ సుప్రీం బెంచ్‌ ఆయాపుపన్ను శాఖను దుమ్ము దులిపింది. సుప్రీం న్యాయమూర్తి మదన్‌ లోకుర్‌తో కూడిన త్రిసభ్య బెంచ్‌ ఆదాయపుపన్ను శాఖ, ఘాజియా బాద్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను గతవారం విచా రిస్తూ అధికారులపై మండిపడింది. తక్షణం కాస్టుల కింద 10లక్షలు డిపాజిట్‌ చేయమని ఆదేశించింది.

ఒక చిన్న సమాధానాన్ని ఇవ్వటానికి 596రోజులు తీసుకున్నారు..కోర్టును తప్పుదోవ పట్టించేలా.. అన్ని తప్పులు తడకలు..అర్థంలేని సమాధానాలతో కోర్టు సమయాన్ని వృధా పరిచారని బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పరిపాలనలో ఉన్న శాఖకు సుప్రీంకోర్టుఅంటే ఎంతగౌరవముందో తెలుస్తోంది.. అంటూ బెంచ్‌మండిపడింది. పిటిషన్‌కు సంబం ధించి మరోకేసు సుప్రీంలోనే 2012 నుండి విచా రణలో ఉందని పేర్కొనేందుకు ఆదాయపు పన్ను శాఖ తీవ్ర ఆలస్యం చేయటంతో పాటు పొంతనలేని సమాధానాలతో స్టేట్‌పెంట్‌ను సుప్రీంలో దాఖలు చేయటంతో సుప్రీం బెంచ్‌ నిప్పులు చెరిగింది.