సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరో సీబీఐ అధికారి

cbi deputy sp ak base
cbi deputy sp ak base

న్యూఢిల్లీ: సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. తనను బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డిప్యూటి ఎస్సీ ఏకే బస్సీ ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా లంచం కేసులో తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆస్థానాపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే దీనిపై శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆయన చేసిన విన్నపాన్ని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.