సునీల్‌ ..ఉంగరాల రాంబాబు!

VUNGARALA
VUNGARALA

సునీల్‌.. ఉంగరాల రాంబాబు!

సునీల్‌, మియా జార్జ్‌ జంటగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఉంగరాల రాంబాబు అనే క్యాచీ టైటిల్‌ ను ఖరారు చేశారు. రథ సప్తమి సందర్బంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రాన్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. క్రాంతి మాధవ్‌ గారి మార్క్‌ వుంటూనే.. సునీల్‌ తరహా కామెడీ చేస్తూ ఓ చక్కని కమర్షియిల్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ను అందిచబోతున్నారు. సునీల్‌ పెర్ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్‌ ను విభిన్నంగా మలిచారు. కథ, కథనాలకు తగ్గట్టుగా ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ ను నిర్ణయించాం. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చిదిద్దారు. అన్ని వర్గాల్నిమెప్పించే ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీ కాబోతుంది. మా బ్యానర్‌ నుంచి సూపర్‌ హిట్‌ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూరె్తంది. త్వరలోనే గ్రాండ్‌ గా ఆడియో లాంచ్‌ నిర్వహించబోతున్నాం. వేసవి కానుకగా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.