సుధీర్‌బాబు హీరోగా ‘సమ్మోహనం’

sudheer babu
sudheer babu

సుధీర్‌బాబు, బాలీవుడ్‌ నటి ఆదితిరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి సమ్మోహనం అనేపేరును ఖరారు చేశారు.. గురువారం సాయంత్రం 4.41 గంటలకు టైటిల్‌ను ప్రకటించారు. చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ, సమ్మోహనం. అంటే మంత్రముగ్ధులని చేసే ఒక అందమైన ఆకర్ఫఱ..ఒక మ్యూజికల్‌ ఎట్రాక్షన్‌ ..మా చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య సమ్మోహనమైన రొమాన్స్‌ ఉండటంతోపాటు మిగతా పాత్రలకి ఉండే విభిన్నమైన ఆకర్షణలు మెప్పిస్తాయి.. ఓ కొత్త పోకడ ఉన్న నవతరం ప్రేమకథా చిత్రంగా ఉంటూనే ఆద్యంతం హాస్యం సజీవమైన కుటుంబ బంధాలు, ఉద్వేగ భరిత సన్నివేశాల సమాహారంగా సమ్మోహనం తెరకెక్కతోందని అన్నారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, కథకు యాప్ట్‌గా ఉండేలా సమ్మోహనం టైటిల్‌ను ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయని, ఈనెల 22 నుంచిమార్చి 3 వరకు నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. దాంతో 80శాతం షూటింగ్‌ పూర్తవుతుందని, మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్‌ 3 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌, ముంబైలో షూటింగ్‌ చేస్తామన్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారన్నారు. ఇది ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్‌, ప్రేమ, వినోదం ప్రధానంగా ఉంటాయన్నారు. మే మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.