సుకుమార్ సినిమా చేయడానికి సుముఖం..

Mahesh babu
Mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘వన్ నేనొక్కడినే’ కూడా ఒకటి. సుకుమార్ యొక్క భిన్నమైన టేకింగ్, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుడ్ని మంచి ప్రశంసలు అందుకుంది. దీంతో సుకుమార్ వర్క్ పట్ల ఇంప్రెస్ అయిన మహేష్ ఆయనతో మరొక సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇటీవలే సుకుమార్ మహేష్ కు ఒక లైన్ చెప్పారని, అది నచ్చడంతో మహేష్ సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారని, ‘నెన్నొక్కడినే’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వినికిడి. ఒకవేళ ఇదే గనుక వాస్తవమై ప్రాజెక్ట్ సెట్టైతే మహేష్ కొరటాల చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేసి అనంతరం ఈ ప్రాజెక్టును చేయొచ్చు.