సుంకాల పెంపుతో ఏవియేషన్‌ షేర్లు పతనం

3 SPICE JETS
3 SPICE JETS

న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడిచమురు ధరలు తాజాగా నాలుగేళ్ల గరిష్టానికి చేరడంతో ఈ కౌంటర్లు కుదేలయినట్లు నిపుణులు చెబుతున్నారు. కరెంట్‌ ఖాతా లోటు కట్టడికి ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై 19 శాతం కస్టమ్స్‌ డ్యూటీని విధించింది. దీంతో ఏవియేషన్‌ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో బ్రాండు విమాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సహా జెట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ కౌంటర్లు 52 వారాల కనిష్టానికి చేరింది. ఇటీవల పతనదిశలోనే సాగుతున్న విమానయాన కౌంటర్లు రెండోరోజు కూడా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 2.4శాతం పతనమై రూ.832 వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.818 వరకూ దిగజారింది. ఇది 52 వారాల కనిష్టం కాగా, ఈ బాటలో జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు 4.25 శాతం క్షీణించి రూ.184 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.181 వరకూ తిరోగమించింది. ఇది ఏడాది కనిష్టం కాగా, బిఎస్‌ఇలో స్పైస్‌జెట్‌ షేరు సైతం 2.3శాతం వెనకడగు వేసి రూ.68 వద్ద ట్రేడవుతోంది. మొదట రూఏ.67 దిగువన 52 వారాల కనిష్టానికి చేరింది. గత రెండురోజుల్లోనూ ఈ కౌంటర్లు 10 శాతం స్థాయిలో క్షీణించిన సంగతి విదితమే.