సీషెల్స్‌కు భారత్‌ గిఫ్ట్‌ డోర్నియర్‌!

DORNIER
DORNIER

న్యూఢిల్లీ: ఆరురోజులపాటు భారత్‌పర్యటను వచ్చిన సీషెల్స్‌ అధ్యక్షుడు డేనీ ఫోరేకు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌తయారుచేసిన డూ-228 మారిటైమ్‌ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్‌ బహూకరించింది. ఈవిమానం సీషెల్స్‌ ద్వీపకల్పంలో సముద్రజలాలపై పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పనిచేస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ సీషెల్స్‌కు 100 మిలియన్‌ డాలర్ల ఎల్‌ఒసిని సైతం మంజూరుచేసారు. భారత్‌నుంచి మిలిటరీ హార్డ్‌వేర్‌ కొనుగోలుకు ఈమొత్తం వినియోగిస్తారు. విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ ఢిల్లీలోని పాలం విమానాశ్రయం సాంకేతిక విభాగం వద్ద విమానం అందచేసారు. భారత్‌ సీషెల్స్‌మధ్య మరింతగా పరస్పర సహకారం పెంపొందించేందుకువీలుగా రెండుదేశాలు పనిచేస్తాయని సుష్మస్వరాజ్‌ అన్నారు. ఎయిర్‌క్రాప్ట్‌బహుమతిని స్వీకరిస్తూ ఫోరే ఈరోజు తమకు చారిత్రాత్మకమైన రోజని అన్నారు. ఈ విమానంతో సీషెల్స్‌ కోస్తాప్రాంతంలో నిఘాను మరింతపెంచేందుకు దోహదంచేస్తుందని అన్నారు. ఈ విమానం ఈనెల 29వ తేదీ సీషెల్స్‌ 42వ స్వాతంత్య్రదినోత్సవం ందర్భంగా ఆదేశానికి చేరుతుంది. సీషెల్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి ఇప్పటికే ఈ విమానంపై శిక్షణ ఇచ్చారు. ఈ విమానం తయారీలోను మరమ్మతులనిర్వహణలోను సీషెల్స్‌ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హాల్‌ సిఎండి టి.సువర్ణరాజు వెల్లడించారు. సీషెల్స్‌కుభారత్‌ బహుమతిగా ఇచ్చిన విమానాల్లో ఇది రెండవది. 2013జనవరిలో ఒక విమానాన్ని బహూకరించింది. 2015 మార్చినెలలో మోడీ పర్యటన సందర్భంగా ఈ విమానం బహూకరిస్తామని ప్రకటించారు. డోర్నియర్‌ 228 విమానాన్ని అన్నిరకాలుగా వినియోగించుకోవచ్చు. సముద్రజలాలపై గస్తీ, పర్యావరణ పర్యవేక్షణ,నియంత్రణ, తనిఖీ, పునరావాస రక్షణ కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉంది.