సీబీఎస్‌ఈ స్కూల్‌ సిలబస్‌ను 15 శాతం తగ్గించేదుకు చర్యలు

CBSE
CBSE

న్యూఢీల్లీ: సీబీఎస్‌ఈ వచ్చేవిద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు సిలబస్‌ను 10 నుండి 15 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. సిలబస్‌ను మరీ కఠినంగా లేకుండా మార్చేందుకు చర్చలు తీసుకుంటున్నాట్లు ఆయన చెప్పారు. మార్చబోయే సిలబస్‌ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టి) తుది మెరుగులు దిద్దుతుంది. సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలలకూ మార్చబోయే సిలబస్‌ వర్తిస్తుందని తెలిపారు.