సీత్కారి

YOGA-2
YOGA

సీత్కారి

ఈ సాధన వలన శరీరంలో చల్లదనం కలుగుతుంది. కాబట్టి దీనిని వేసవికాలంలో చేయడం మంచిది. ఈ విధానంలో పద్మాసనం లేదా సిద్ధాసనంలో కూర్చుని, నోట్లోని నాలుకను వెనక్కి మడిచి, అంగుళికి తగిలేట్లు పళ్లతో కరిచి పట్టుకోవాలి. రెండు పెదవ్ఞలను బాగా విడమర్చి, పంటి సందుల్లోంచి శ్వాసను బాగా పీలుస్తూ, సాధ్యమైనంత సేపు కుంభిస్తూ, చుబుకాన్ని ఛాతి మీదకు బాగా అదిమి ఉంచాలి. తరువాత తలను బాగా పైకి లేపి శ్వాసను వదలాలి. దీనివలన శరీరంలో పైత్య వికారాలు తగ్గిపోతాయి. గ్రంధులన్నీ బాగా పనిచేస్తాయి. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.