సీఎం చంద్ర‌బాబే మిత్ర‌ధ‌ర్మాన్ని ఉల్లంఘించారు: సోము

Somu veerraju
Somu veerraju

చంద్రబాబే మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాగా, కాసేపటి క్రితం చంద్రబాబు అన్న వ్యాఖ్యలకు స్పందించిన సోము వీర్రాజు మాట్లాడుతూ… బీజేపీ ఓర్పుతోనే వ్యవహరిస్తోందన్నారు. టీడీపీతో విడిపోవాలని ఏనాడూ కోరుకోలేదన్నారు. 2014లో బీజేపీకి 14 సీట్లు ఇచ్చి నాలుగు స్థానాల్లోఇండిపెండెంట్లను నిలబెట్టారన్నారు. ఇండిపెండెంట్లను పార్టీలోకి తీసుకోం అని టీడీపీ ప్రకటించి మాట తప్పిందన్నారు. ఇది మిత్ర బంధమా..? అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు.