సీఎం చంద్ర‌బాబుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

Pavan Kalyan
Pavan Kalyan

శ్రీ‌కాకుళం: సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. ‘‘ధర్మపోరాటం అంటే ఏంటో నాకు అర్థంకాలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళదాం…నేనోవైపు…మీరోవైపు కూర్చుందాం’’ అంటూ పవన్ సవాల్ విసిరారు. ధర్మపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారని, అవినీతిలో ఏపీని రెండో స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదినని దుయ్యబట్టారు. అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు చేస్తామని, సీఎం నియోజకవర్గంలోనూ నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటామని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.