సీఎం చంద్ర‌బాబుకు మ‌మ‌త ఆహ్వానం

Chandrababu & Mamatha
Chandrababu & Mamatha

ఢిల్లీ: సీఎం చంద్రబాబుకు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆహ్వానం పంపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో ఢిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. బుధవారం పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు మమతాబెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా జాతీయ, ఏపీ రాజకీయాలపై ఎంపీలతో మమత చర్చించారు. మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో బీజీగా గడిపారు. కడప ఉక్కు పరిశ్రమపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి వినప్రతం ఇచ్చారు. అంతేకాకుండా కేంద్ర ఉక్కుమంత్రి బీరేంద్రసింగ్‌ను టీడీపీ ఎంపీలు కలిశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.