సీఎం చంద్ర‌బాబుకు అమిత్ షా ఫోన్‌

 

Chandrababu
Chandrababu

అమ‌రావ‌తి :  ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బిజేపి అధ్య‌క్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. విభ‌జ‌న హామీల‌పై ఈనెల 5న చ‌ర్చిద్దామ‌ని అమిత్ షా అన్నారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ..చ‌ర్చ‌ల‌కు కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి బృందాన్ని పంపుతాన‌ని అమిత్ షాకు చంద్ర‌బాబు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని సీఎం చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో అన్నారు. టీడీపీ చేసే ఏ పోరాట‌మైనా ప్ర‌జ‌ల కోస‌మేన‌ని, అలాగే విభ‌జ‌న హామీల‌పై కూడా పోరాటం చేస్తున్నామ‌ని, అంతేత‌ప్ప బీజేపీ ల‌క్ష్యంగా త‌మ పోరాటం కొన‌సాగ‌డం లేద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు.