సీఎం కెసిఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి దానం

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్‌: మాజీ మంత్రి,కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారనే విషయం విదితమే. కాగా, నేడు సీఎం కెసిఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి దానం చేరారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో సీఎం కెసిఆర్‌ సమక్షంలో దానం తన అనుచరులతో టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దానం గులాబీ గూటికి చేరారు.