సీఎం కెసిఆర్‌తో అఖిలేష్‌ భేటీ

KCR & Akhilesh Yadav
KCR & Akhilesh Yadav

హైదరాబాద్‌: పాలనలో గుణాత్మక మార్పు తన లక్ష్యమంటూ బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నేడు భేటీ అయ్యారు. దేశా రాజకీయాలపై వారి మద్య చర్చలు జరగనున్నాయి. అంతకు మునుపు హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేష్‌ యాదవ్‌కు తెలంగాణ మంత్రుల కెటిఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న అఖిలేష్‌, అందులో తేనీటి విందులో పాల్గొననున్నారు.