సీఎం కెసిఆర్‌కు రేవంత్ లేఖ‌

 

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి రెండుసార్లు వివాదాస్పద స్థలం కేటాయించారని, ఇది క్రిస్టియన్లను అవమానించడమేనని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి వెంటనే 10 ఎకరాల వివాదరహిత స్థలం, రూ.25కోట్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు