సీఎం కెసిఆర్‌కు ‘చాడ’ బ‌హిరంగ లేఖ‌!

Chada
Chada

హైదరాబాద్: న‌గ‌రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్టును పాతబస్తీ వ‌ర‌కు విస్తరించాలని సీఎం కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పాతబస్తీలో మెట్రోరైల్‌ ప్రాజెక్టును చేపట్టాలని ఎంఐఎం మినహా రాజకీయపార్టీలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయని గుర్తు చేశారు. అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మూడేళ్లు గడుస్తున్నా స్పందించకపోవడం దారుణమని చాడ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.