సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు: జగన్‌

Y S Jagan 2
Y S Jagan

అనంతపురం: ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని వైఎస్సార్సీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత జగన్‌ అన్నారు. పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాక అందరికిఈ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్సార్సీ ప్రభుత్వం రావాల్సిందేనన్నారు.