సీఎంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ నేతలు

 

KUMARA SWAMY
KUMARA SWAMY

బెంగళూరు: రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెల్లుబికింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు కొన్ని కీలక పదవులను ఎమ్మెల్యేలకు కట్టబెట్టారు. అయితే ముఖ్యమంత్రి వీరిలో 9మంది ఎమ్మెల్యేలకు ఊహించని షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ సిఫారసు చేసినప్పటికీ పట్టించుకోకుండా వీరి నియామకాలకు సీఎం బ్రేక్‌ వేశారు. కాంగ్రెస్‌ జేడీఎస్‌ సంకీర్ణ పాలకుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవులను మూడింట రెండొంతలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా సీఎం పట్టించుకోకపోవడమే వివాదానికి కారణమైంది.